హైదరాబాద్ లో సొంత అకాడమీ ఏర్పాటు చేసిన గుత్తా జ్వాల
Advertisement
భారత్ లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణుల్లో గుత్తా జ్వాల ఒకరు. డబుల్స్ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో అనేక విజయాలు అందుకున్న జ్వాల ఇప్పుడు సొంత అకాడమీ స్థాపించింది. దీని పేరు జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్స్ లెన్స్.  ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ జ్వాల అకాడమీ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి  ప్రముఖ ప్రొ బాక్సర్ విజేందర్ సింగ్, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్వాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

జ్వాల తన అకాడమీని హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లో ఉన్న సుజాత విద్యాసంస్థలో ఏర్పాటు చేసింది. ఇక్కడ బ్యాడ్మింటన్ మాత్రమే కాదు, క్రికెట్, వాలీబాల్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, సాకర్ వంటి ఇతర క్రీడల్లోనూ శిక్షణ ఇస్తారు. ఈ అకాడమీలో మొదట 14 కోర్టులలో బ్యాడ్మింటన్ శిక్షణ ఇవ్వనున్నారు. ఆపై క్రమంగా విస్తరిస్తారు.
Tue, Dec 10, 2019, 06:40 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View