ఢిల్లీలో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ వైఫై కాల్స్
Advertisement
భారతీ ఎయిర్ టెల్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న వైఫై వాయిస్ కాల్స్ సౌకర్యం తొలి విడతగా న్యూఢిల్లీలోని కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ సౌకర్యం కారణంగా ఎయిర్ టెల్ కస్టమర్లు సాధారణ వాయిస్ కాల్స్ మాదిరిగానే ఈ వైఫై కాల్స్ కూడా చేసుకోవచ్చు.

ఇతర నెట్ వర్క్స్ కు చెందిన 2జి, 3జి, 4జి, వీవోఎల్టీఈ, వైఫై వినియోగదారులకు కూడా కాల్స్ చేయవచ్చు. ఎయిర్ టెల్ వినియోగదారులు రోమింగ్ సమయంలో కూడా వై-ఫై కాల్స్ చేసుకోవచ్చని, దీని కోసం కొత్త సిమ్ కార్డులను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని సంస్థ ప్రకటించింది. అయితే అంతర్జాతీయ కాల్స్ ను ప్రస్తుతానికి అనుమతించడంలేదు. త్వరలోనే అన్ని హాట్ స్పాట్ లు, బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లకు ఈ సౌకర్యాన్ని  కల్పించనున్నట్లు కూడా ఎయిర్ టెల్ పేర్కొంది.
Tue, Dec 10, 2019, 05:25 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View