గుంటూరులో దారుణం.. వదినపై మరుదుల అత్యాచారం.. సహకరించాలన్న భర్త, అత్తమామలు!
Advertisement
సొంత వదినపై మరుదులు అత్యాచారానికి పాల్పడగా, వారికి సహకరించాల్సిందిగా భర్త, అత్తమామలు ఒత్తిడి తెచ్చిన ఘటన గుంటూరులో జరిగింది. బాధితురాలు ఈ ఘోరాన్ని నిన్న గుంటూరు అర్బన్‌లో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో చెబుతూ కన్నీటి పర్యంతమైంది. ఆమె కథనం ప్రకారం.. పాత గుంటూరుకు చెందిన బాధితురాలికి 2011లో వివాహమైంది. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన మామ కాళ్లు పట్టాలంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆమె అలాగే చేసేది. ఈ క్రమంలో అతడు కోడలితో అసభ్యంగా ప్రవర్తించేవాడు.

ఆ తర్వాత ఇద్దరు మరుదులు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. నాలుగో మరిది పాలల్లో మత్తు ట్యాబ్లెట్లు కలిపి ఇచ్చి, ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేశాడు. విషయాన్ని భర్తకు చెబితే అలా ఇష్టం అయితేనే ఉండాలని, లేదంటే వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో వారి అరాచకాలు భరించలేని ఆమె వారిపై వేధింపుల కేసు పెట్టింది. ప్రతిగా నిందితులు ఆమెపై దొంగతనం కేసు మోపి అరెస్ట్ చేయించారు. ఇప్పుడు విడాకులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది.
Tue, Dec 10, 2019, 07:11 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View