బంగారు తెలంగాణ నుంచి బకాయిల తెలంగాణగా మార్చారు: డాక్టర్ లక్ష్మణ్
Advertisement
తెలంగాణలో ఆర్థిక పరిస్థితి దిగజారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కడి ఓటర్ల తీర్పు బీజేపీ పాలనకు అద్దం పట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నుంచి బకాయిల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు.

 ప్రభుత్వ అసమర్థతతోనే ఆర్థిక ఇబ్బందులు తలెత్తున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేతిలో సంపన్న రాష్ట్రాన్ని పెడితే ఆయన అప్పుల ఊబిలోకి నెట్టారని పేర్కొన్నారు. కేసీఆర్ విధానాల కారణంగా రాష్ట్రం దివాలా తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక పథకాలు నిలిచిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. పలు శాఖల ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించడంలేదని విమర్శించారు.
Mon, Dec 09, 2019, 08:48 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View