మానవాభివృద్ధి సూచీలో ఒక మెట్టు ఎగబాకిన భారత్
Advertisement
అంతర్జాతీయ మానవాభివృద్ధి సూచీలో గతేడాది 130వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి కాస్త మెరుగైంది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన జాబితాలో ఓ మెట్టు ఎగబాకి 129వ స్థానంలో నిలిచింది. మొత్తం 189 దేశాలతో ఐక్యరాజ్యసమితి ఈ జాబితా రూపొందించింది. 2005 నుంచి 2016 వరకు 27.1 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకువచ్చారని, భారత్ లో మానవాభివృద్ధి విలువ 50 శాతం పెరిగిందని నివేదికలో వెల్లడించారు. 1990 నుంచి 2018 వరకు భారతీయుల జీవితకాలం 11.6 ఏళ్లు పెరిగిందని, తలసరి ఆదాయం 250 శాతం పెరిగిందని పేర్కొన్నారు.
Mon, Dec 09, 2019, 08:16 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View