వివేకా హత్య కేసులో విచారణకు హాజరు కాని ఆదినారాయణరెడ్డికి మళ్లీ నోటీసులు
Advertisement
వైఎస్ వివేకా హత్య కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి మరోసారి సిట్ నోటీసులు అందాయి. ఇప్పటికే, రెండుసార్లు నోటీసులిచ్చినా విచారణకు ఆదినారాయణరెడ్డి హాజరుకాలేదు. దీంతో, మూడోసారి ఆయనకు నోటీసులు అందాయి. సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. కాగా, కడప జిల్లా దేవగుడిలోని ఆదినారాయణరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో ఆదినారాయణరెడ్డి ఇంట్లో లేరని తెలుస్తోంది.Mon, Dec 09, 2019, 08:11 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View