ఎన్ కౌంటర్ లో గాయపడ్డ ఎస్సై, కానిస్టేబుల్ ను విచారించిన ఎన్ హెచ్ ఆర్సీ
Advertisement
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ లో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) విచారణను కొనసాగిస్తోంది. నిన్న దిశ కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన కమిషన్ తాజాగా ఈ ఎన్ కౌంటర్లో గాయపడ్డ ఎస్సై, కానిస్టేబుల్ ను విచారించింది. గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ లను జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులు ప్రశ్నించారు. ఈ మేరకు వారు చెప్పిన వివరాలను సభ్యులు నమోదు చేసుకున్నారు.
Mon, Dec 09, 2019, 08:09 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View