బన్నీతో సినిమా చేయాలని నాకూ వుంది: 'వెంకీమామ' దర్శకుడు
Advertisement
బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ' రూపొందింది. వెంకటేశ్ - నాగచైతన్య కథానాయకులుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి దర్శకుడు బాబీ మాట్లాడుతూ .."అన్ని తరగతుల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందించాను.

బయట వెంకటేశ్ గారిని చైతూ 'వెంకీమామ' అని పిలుస్తాడట. ఈ సినిమాలోనూ వాళ్లిద్దరి మధ్య అదే వరస ఉంటుంది గనుక, ఆ టైటిల్ ను ఫిక్స్ చేశాను. టైటిల్ కి మంచి మార్కులు పడ్డాయి. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. నా తదుపరి సినిమా బన్నీతో వుంటుందనే టాక్  నా వరకూ వచ్చింది. బన్నీతో ఒక సినిమా చేయాలని నాకూ వుంది. అలాంటి అవకాశం కోసమే నేను కూడా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Mon, Dec 09, 2019, 07:48 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View