సభా సంప్రదాయాలను స్పీకరే ఉల్లంఘించడం దారుణం: చంద్రబాబునాయుడు
Advertisement
అసెంబ్లీ సమావేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని, తమను మాట్లాడనివ్వలేదని, తమ విజువల్స్ కూడా ప్రసారం చేయకపోవడంతో తాము ఉన్నామా? లేదా? అన్న విషయం కూడా బయటవాళ్లకు తెలియనీయకుండా చేసే పరిస్థితికి వస్తున్నారని అధికార వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు.

మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంత నీచమైన, దారుణమైన రాజకీయాలు తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, సభా సంప్రదాయాలను స్పీకరే ఉల్లంఘించడం దారుణమైన విషయమని, అందుకే, ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పాల్సి వస్తోందని చెప్పారు.

అధికార పక్ష సభ్యులు తమపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పడం ప్రజాస్వామ్యంలో సంప్రదాయమని, తమకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ వన్ సైడ్ వెళ్లిపోయారని విమర్శించారు. మీడియాను అదుపు చేస్తూ, దానిపై కేసులు వేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఓ జీవోను తీసుకొచ్చిందని విమర్శించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రస్తావించకుండా మూడు నాలుగు ఛానెల్స్ ను నిషేధించారని, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామంటున్నారని, ఉల్లిపాయల కోసం ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.
Mon, Dec 09, 2019, 07:38 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View