పవన్ కు భయపడి రూ.87 కోట్లు విడుదల చేశామనడం అర్థరహితం: ఏపీ మంత్రి కన్నబాబు
Advertisement
తాను రైతులను కలిసేందుకు వస్తున్నానని తెలిసి వైసీపీ ప్రభుత్వం భయపడిందని, అందుకే హడావుడిగా ధాన్యం బకాయిలు రూ.87 కోట్లు విడుదల చేసిందని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు స్పందించారు. పవన్ బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ సగం సగం సమాచారంతో ఏదో మాట్లాడుతున్నారని, లేని సమస్యను పరిష్కరించాలని దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ వస్తున్నాడని భయపడి రూ.87 కోట్ల చెల్లింపులు చేశామనడం అర్థరహితమని మంత్రి వ్యాఖ్యానించారు.

"పవన్ కు మేం భయపడడమేంటి? పవన్ తన భాష మార్చుకోవాలి. ఎవరో వచ్చి ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేయాల్సిన అవసరం లేదు. రైతులను ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే ఇబ్బందికి గురిచేశారో పవన్ చెప్పాలి" అంటూ డిమాండ్ చేశారు.
Mon, Dec 09, 2019, 07:31 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View