బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్-2019 బరిలో సింధు
Advertisement
త్వరలో చైనాలో ప్రారంభం కానున్న బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్-2019 టోర్నీకి భారత షట్లర్ పీవీ సింధు ఎంపికైంది. ఈ నెల 11 నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ ‘ఎ’ లో చోటు దక్కించుకున్న సింధు బుధవారం తన తొలి మ్యాచ్ లో జపాన్ షట్లర్ అకానె యమగుచితో తలపడనుంది. గ్రూప్ ‘ఎ’ లో సింధుతో పాటు, అకానె యమగుచి, చెన్ యుఫీ, హీ బింగ్జియోలున్నారు.

బీడబ్ల్యుఎఫ్ టాప్ ర్యాంకుల్లో ఉన్న క్రీడాకారుణులు ఈ పోటీలకు అర్హత సాధిస్తారు. సింధు టాప్ ఎనిమిది మంది క్రీడాకారిణుల్లో లేకపోయినప్పటికీ.. బాసెల్ లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో సింధు స్వర్ణం సాధించడంతో ఈ పోటీలకు అర్హత సాధించిందని సమాచారం. గ్రూప్ ‘బి’లో ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ తై జు యింగ్, మాజీ ఛాంపియన్ నొజోమి ఒకుహర, థాయిలాండ్ కు చెందిన బుసనన్ లు ఉన్నారు.
Mon, Dec 09, 2019, 07:30 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View