'సరిలేరు నీకెవ్వరు' నుంచి లిరికల్ వీడియో సాంగ్
Advertisement
మహేశ్ బాబు కథానాయకుడిగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం రూపొందింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

"సూర్యుడివో .. చంద్రుడివో .. ఆ ఇద్దరి కలయికవో, సారథివో .. వారథివో .. మా ఊపిరి కన్న కలవో" అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. ప్రాక్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. కథానాయకుడి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ సాగే పాట ఇది. చాలా తేలికైన పదాలతో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట అందరికీ అర్థమయ్యేలా అందంగా సాగుతోంది. విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.
Mon, Dec 09, 2019, 06:50 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View