భారత మార్కెట్లోకి వివో సరికొత్త ఫోన్ వీ 17
Advertisement
భారత మార్కెట్లో దూసుకు పోతున్న చైనా మొబైల్ కంపెనీ వివో, అధునాతన ఫీచర్లను కలిగిన వీ17 ఫోన్ ను లాంచ్ చేసింది. ముందు వైపు హోల్ పంచ్ కెమెరా, వెనకవైపు ఆంగ్ల అక్షరం ఎల్ ఆకారంలో క్వాడ్ కెమెరాలు ఉండటం దీని స్పెషాలిటీ. ఈ నెల 17 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్న ఫోన్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. మిడ్ నైట్ ఓసన్(బ్లాక్), గ్రేసియర్ ఐస్(వైట్) రంగుల్లో ఆకట్టుకోనుంది. అండ్రాయిడ్ 9పై.. ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ 9.2 తో ఇది పనిచేస్తుంది. 6.44 అంగుళాల స్క్రీన్ తో ఈ-3 సూపర్ అమోలెడ్ ఐవ్యూ డిస్ ప్లే 20:9 ఆస్పెక్ట్ రేషియోలో చిత్రం కన్నిస్తుంది.  అంతేకాక ఇది పూర్తిస్థాయి హెడి ప్లస్ ను కలిగివుంది.

స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 48 మెగాపిక్సల్ ప్రధాన రేర్ కెమెరాతో పాటు 8 2 2 ఎంపీ సామర్థ్యమున్న కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు డిస్ ప్లే లో అంతర్భాగంగా 32 ఎంపీ సామర్థ్యమున్న సెల్ఫీ కెమెరాను అమర్చారు. యూఎస్ బీ, టైప్ సి పోర్ట్, బ్లూటూత్ 5.0, ఫింగర్ ప్రింట్, జెండర్ డిటెక్షన్, తదితర ఫీచర్లతో పాటు 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.22,990గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ/128 జీబీ స్టోరేజీతో వస్తోన్న వి17 మోడల్ ఫోన్లు ఆన్ లైన్ విక్రయ సంస్థలు అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్, వివో ఇండియా ఈ స్టోర్ తో పాటు.. ఆఫ్ లైన్ దుకాణాల్లో కూడా లభ్యమవుతాయి.
Mon, Dec 09, 2019, 06:36 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View