క్యూ లైన్లో సాంబిరెడ్డి మృతి ఘటన వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి: జనసేన
Advertisement
ఉల్లిపాయల కోసం గుడివాడలోని రైతుబజార్ క్యూ లైన్లో జరిగిన తొక్కిసలాటలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి సాంబిరెడ్డి మృతి చెందిన ఘటనపై జనసేన పార్టీ స్పందించింది. ఈ విషాద ఘటన మనసును కలచివేసిందని పేర్కొంది. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమైన గుడివాడలో జరిగిన ఈ ఘటనతో అయినా వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని పేర్కొంది.

ప్రజలు ఉల్లి పాయల కోసం గంటల కొద్దీ క్యూ లైన్ లో నిలబడాల్సి రావడం ఈ ప్రభుత్వం చేతకానితనాన్ని తెలియజేస్తోందని విమర్శించింది. ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనడానికి రైతు బజార్ల వద్ద క్యూలైన్లే నిదర్శనమని తెలిపింది.
Mon, Dec 09, 2019, 06:22 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View