జగన్ గారూ! క్యూలైన్లలో ప్రభుత్వ హత్యలు ఆపండి: నారా లోకేశ్
Advertisement
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఉల్లిపాయల ధరలు తార స్థాయిలో ఉన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని లోకేశ్ వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలపై జగన్ కు అంతకక్ష ఎందుకో? జగన్ అసమర్థ పాలన కారణంగా ఉల్లి కోసం సామాన్యులు అల్లాడుతున్నారని, ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని మండిపడ్డారు.

ఉల్లిపాయల కోసం రైతుబజారు క్యూలైన్లో నిలబడ్డ సాంబయ్య మృతి చెందిన ఘటన గురించి ప్రస్తావించారు. వైసీపీని గెలిపిస్తే అన్నీ డోర్ డెలివరీ చేయిస్తానన్న జగన్, కనీసం ఉల్లిపాయల నైనా డోర్ డెలివరీ చేయాలని, క్యూలైన్లలో ప్రభుత్వ హత్యలు ఆపాలని డిమాండ్ చేశారు.
Mon, Dec 09, 2019, 05:49 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View