అందుకే రష్మిక ఆ ఆఫర్ వదులుకుందట
Advertisement
యూత్ లో ఇప్పుడు విపరీతమైన క్రేజ్ వున్న కథానాయికలలో రష్మిక ఒకరు. వరుసగా ఆమె స్టార్ హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వెళుతోంది. అలాంటి రష్మికకి హిందీ 'జెర్సీ' రీమేక్ లో ఛాన్స్ వచ్చిందనీ, అయితే అడిగినంత పారితోషికం ఇవ్వలేదనే కారణంగా 'నో' చెప్పేసిందనే ప్రచారం ఊపందుకుంది.

డబ్బుకి ప్రాధాన్యతనిస్తూ మంచి పాత్రను వదులుకుందనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రష్మిక స్పందిస్తూ .."హిందీ 'జెర్సీ' రీమేక్ లో నాకు అవకాశం వచ్చిన మాట నిజమే. అయితే అంతటి బరువైన పాత్రకి న్యాయం చేయలేనేమోననే ఉద్దేశంతోనే నేను అంగీకరించలేదు. అంతేగానీ ఈ సినిమాను వదులుకోవడానికి పారితోషికం కారణం కానేకాదు. మంచి పాత్రలను పారితోషికంతో నేను ఎప్పుడూ ముడిపెట్టను" అని చెప్పుకొచ్చింది.
Mon, Dec 09, 2019, 05:04 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View