బాలయ్య కోసం పవర్ఫుల్ స్టోరీ రెడీ చేసిన వినాయక్
Advertisement
తెలుగులో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకులలో వినాయక్ ఒకరిగా కనిపిస్తాడు. బాలకృష్ణతో గతంలో 'చెన్నకేశవరెడ్డి' అనే చిత్రాన్ని తెరకెక్కించిన వినాయక్, ఈ మధ్య కాలంలో ఆయనతో మరో సినిమాను చేయడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వచ్చింది.

'జైసింహా'కి ముందు కూడా బాలకృష్ణతో సినిమా చేయడానికి వినాయక్ సన్నాహాలు చేసుకున్నాడుగానీ, సెకండాఫ్ విషయంలో బాలయ్యను సంతృప్తి పరచలేకపోయాడు. దాంతో వరుసగా రెండు ప్రాజెక్టులు కేఎస్ రవికుమార్ చేతికి వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే సెకండాఫ్ విషయంలోనూ బాలకృష్ణను వినాయక్ మెప్పించాడని అంటున్నారు. బోయపాటి మూవీ తరువాత వినాయక్ తోనే బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Mon, Dec 09, 2019, 04:35 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View