చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు... ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో శిక్షించండి: జయప్రద
Advertisement
దిశ హత్యోదంతంపై సినీ నటి, రాజకీయవేత్త జయప్రద స్పందించారు. షాద్ నగర్ ఘటనపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడుతూ, ఆడబిడ్డలపై అత్యాచారాలు చేసేవాళ్లకు మరణశిక్షే సరైనదని, అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్ష వేయాలని సూచించారు. ఘటన జరిగిన వెంటనే శిక్షలు అమలు చేయడం ద్వారా ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలంటే ఉరిశిక్షలే మార్గమని పేర్కొన్నారు.
Mon, Dec 09, 2019, 04:33 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View