ఢిల్లీలో భవన నిర్మాణాలపై ఆంక్షలను పాక్షికంగా సడలించిన సుప్రీంకోర్టు
Advertisement
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నగరంలో భవన నిర్మాణాలపై గతంలో విధించిన ఆంక్షలను పాక్షికంగా సడలించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు భవన నిర్మాణాలు చేసుకోవచ్చని అనుమతినిచ్చింది. ఈ అంశంపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంక్షల సడలింపు చేశామని కోర్టు పేర్కొంది.

ఇది ఇలావుండగా, పంట వ్యర్థాల దహనంపై ఈనెల 11లోపు వివరాలను తమకు నివేదించాలని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. కాలుష్యంపై ఈ నెల 11న నిపుణుల కమిటీ సమావేశమై 13న నివేదిక సమర్పించాలని సూచిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Mon, Dec 09, 2019, 04:23 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View