రాశి ఖన్నా ఫుల్ ఖుషీ అవుతోందట!
Advertisement
తెలుగు తెరపై అందంగా మెరిసే కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. నిదానమే ప్రధానం అన్నట్టుగా ఒక్కో సినిమాను చేసుకువెళుతున్న రాశి ఖన్నా, తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజా చిత్రాలుగా 'వెంకీమామ'.. 'ప్రతిరోజూ పండగే' సినిమాలు రూపొందాయి.

ఈ నెల 13వ తేదీన 'వెంకీమామ' .. ఈ నెల 20వ తేదీన 'ప్రతిరోజూ పండగే' సినిమాలు విడుదల కానున్నాయి. వారం రోజుల తేడాతో తన సినిమాలు విడుదల కానుండటంపట్ల రాశి ఖన్నా ఫుల్ ఖుషీ అవుతోందట. ఈ రెండు సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలోనే కొనసాగనున్నప్పటికీ, ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి. యూత్ కి నచ్చే అంశాలు పుష్కలంగా వున్నవి. అందువలన ఈ రెండు సినిమాలు తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడతాయనే నమ్మకంతో రాశి ఖన్నా ఉందని అంటున్నారు.
Mon, Dec 09, 2019, 04:13 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View