మిస్ యూనివర్స్ గా సౌతాఫ్రికా నల్ల కలువ!
Advertisement
దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టుంజీ ఈ ఏడాది విశ్వసుందరి (మిస్ యూనివర్స్)కిరీటం గెలుచుకుంది. స్విమ్ సూట్, ఈవెనింగ్ గౌన్ రౌండ్లలో ఆకట్టుకున్న ఈ నల్లకలువ ఆఖర్లో న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నకు ఎలాంటి తడబాటు లేకుండా సమాధానం చెప్పి విజేతగా నిలిచింది. మిమ్మల్మే విజేతగా ఎందుకు ఎన్నుకోవాలని ప్రశ్నించగా.... తనలాంటి శరీర ఛాయ కలిగిన స్త్రీలను అందాలభామలుగా పరిగణించని లోకంలో ఎదిగానని, ఆ భావనకు ముగింపు పలకే సమయం ఆసన్నమైందని చెప్పింది. చిన్నారులు తనను, తన వదనాన్ని చూడాలని కోరుకుంటానని, వారు తమ ప్రతిబింబాలను తనలో చూడాలని కోరుకుంటానని ఆత్మవిశ్వాసంతో ఆమె పలికిన మాటలు న్యాయనిర్ణేతలను మెప్పించాయి.

ఇక రన్నరప్ గా మిస్ మెక్సికో సోఫియా ఆరగాన్, మిస్ ప్యూర్టోరికా మాడిసన్ ఆండర్సన్ నిలిచారు. కాగా, భారత్ నుంచి మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లిన మిస్ ఇండియా వర్తికా సింగ్ కనీసం టాప్-20లో కూడా స్థానం దక్కించుకోలేకపోయింది. ఈ అందాల పోటీలను అమెరికాలోని అట్లాంటాలో నిర్వహించారు.
Mon, Dec 09, 2019, 03:32 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View