నూర్ అహ్మద్ కుటుంబానికి విరాళం ప్రకటించిన రామ్ చరణ్
Advertisement
గ్రేటర్‌ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ అహ్మద్‌ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయమై ‘మెగా’ కుటుంబం వెంటనే స్పందించింది. నూర్‌ అహ్మద్‌ కుటుంబానికి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు రామ్ చరణ్ ఓ ప్రకటన చేశారు. నూర్‌ అహ్మద్‌ మృతిపై సంతాపాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నిన్న ఆయన మరణవార్త తెలిసి చలించిపోయానని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. తాను హైదరాబాద్‌ రాగానే నూర్‌ అహ్మద్‌ కుటుంబాన్ని కలుస్తానని తెలిపారు.

నూర్‌ అహ్మద్‌ గారు మెగా అభిమానులందరిలోకీ గొప్ప వ్యక్తి అని, తమ పేరు మీద ఆయన ఎన్నో పర్యాయాలు రక్తదాన శిబిరాలు నిర్వహించారని, తమ పుట్టినరోజులను పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారని కొనియాడారు. నూర్ అహ్మద్ లేని లోటు తీరనిదని, ‘మెగా బ్లడ్‌ బ్రదర్‌’ నూర్‌ అహ్మద్‌ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు.
Mon, Dec 09, 2019, 03:18 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View