అత్యాచారం చేస్తే రెండు బెత్తం దెబ్బలు వేయాలన్న వ్యక్తి గన్ పట్టుకుని వీధుల్లోకి ఎందుకు వచ్చాడు?: పవన్ పై రోజా వ్యాఖ్యలు
Advertisement
అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే రోజా జనసేనాని పవన్ కల్యాణ్ పై సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యులను దూషించిన వాళ్లను చంపేద్దామని గన్ తీసుకుని వీధుల్లోకి వచ్చిన వ్యక్తి, ఇవాళ అత్యాచారం చేస్తే రెండు బెత్తం దెబ్బలు వేయాలంటున్నారని విమర్శించారు. అత్యాచారానికి శిక్షగా రెండు బెత్తం దెబ్బలు వేయాలనడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.

 ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ సభ్యురాలు రోజా వ్యాఖ్యలకు అడ్డుతగిలారు. సభలో లేని వ్యక్తుల గురించి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. దాంతో రోజా తన విమర్శలను సభలో ఉన్న జనసేన ఎమ్మెల్యే ద్వారా పవన్ కల్యాణ్ కు తెలియజేస్తున్నట్టు సవరణ ప్రకటన చేశారు. అంతేకాదు, ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడు పవన్ తప్ప చరిత్రలో మరెవ్వరూ లేరని ఎద్దేవా చేశారు.
Mon, Dec 09, 2019, 02:30 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View