హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ ఫ్రెష్ కు తేడా తెలియని వారు ఈ సభలో ఉన్నారు: చంద్రబాబు
Advertisement
ఏపీ శాసనసభలో హెరిటేజ్ సంస్థకు సంబంధించి మంత్రి పుష్ప శ్రీవాణి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. హెరిటేజ్ కు సంబంధించిన స్వీట్స్ ను నారా బ్రాహ్మిణి తమకు పంపించారని... హెరిటేజ్ వారిది కాకపోతే తమకు ఆ స్వీట్స్ ఎలా పంపిస్తారని శ్రీవాణి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ... హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ ఫ్రెష్ కు తేడా తెలియనివారు ఈ సభలో ఉన్నారని విమర్శించారు. ఈ రెండూ వేర్వేరని... హెరిటేజ్ ఫ్రెష్ ను ఫ్యూచర్ గ్రూప్ కు ఎప్పుడో అమ్మేశామని చెప్పారు. ఏం మాట్లాడుతున్నారో కూడా వీరికి తెలియడం లేదని అన్నారు. ప్రజల సమస్యలన్నీ గాలికొదిలేసి, 24 గంటలు తనమీద బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు.
Mon, Dec 09, 2019, 02:20 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View