లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా.. వ్యతిరేకించాలంటూ టీఆర్ఎస్ విప్ జారీ
Advertisement
మరో కీలకమైన బిల్లును ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ బిల్లు ఏ ఒక్క వర్గానికీ వ్యతిరేకం కాదని అన్నారు. దేశంలోని మైనార్టీలకు 0.001 శాతం కూడా ఈ బిల్లు వ్యతిరేకం కాదని తెలిపారు. బిల్లుకు సంబంధించి సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సభ నుంచి ఏ పార్టీ కూడా వాకౌట్ చేయవద్దని కోరారు. మరోవైపు, ఈ బిల్లును వ్యతిరేకించాలంటూ తమ ఎంపీలకు టీఆర్ఎస్ విప్ జారీ చేసింది.
Mon, Dec 09, 2019, 12:36 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View