తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం
తన భూ సమస్య పరిష్కరించాలంటూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాడు. అయినప్పటికీ తన సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో చివరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకోవాలని ఓ రైతు భావించాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది.

తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను శరీరంపై పోసుకున్న రైతు శేఖర్ రెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడిని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. తన భూమి సమస్య పరిష్కరించడం లేదని రైతు ఆవేదన చెందాడు. అతడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు నచ్చజెప్పారు. 
Mon, Dec 09, 2019, 12:04 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View