జగన్ రెడ్డి ఉన్నారు కదా... ఉల్లి ఎందుకు సిల్లీగా!: పవన్ కల్యాణ్
Advertisement
ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరతో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీ, జనసేనలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. 'ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ, జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చేయదు. అందుకే ఉల్లి ఎందుకు సిల్లీగా అంటూ దాని రేటును అమాంతం పెంచేశారు' అని ట్వీట్ చేశారు. ప్రజల నిత్యావసరాల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అనడానికి ఇదే నిదర్శనమంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.
Mon, Dec 09, 2019, 11:58 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View