దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం: సుప్రీంకోర్టులో పిటిషనర్ జీఎస్ మణి
Advertisement
దిశ హత్యాచారం కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ఘటనపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై విచారణను అత్యవసరంగా చేపట్టాలని పిటిషనర్ జీఎస్ మణి కోరారు. ఈ ఎన్ కౌంటర్ బూటకమని తెలిపిన ఆయన.. ఎన్ కౌంటర్లపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పాటించలేదని పేర్కొన్నారు.

అయితే, ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఈ అంశంపై విచారణ చేస్తోందని సీజేఐ బోబ్డే అన్నారు. జీఎస్ మణి పిటిషన్ పై ఈ నెల 11న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
Mon, Dec 09, 2019, 11:21 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View