మీ ప్రశంసలు వెలకట్ట లేనివి: రిచర్డ్స్ కు విరాట్ రిప్లై
Advertisement
వెస్టిండీస్ వదిలిన 208 పరుగుల లక్ష్య సాధనలో తనదైన శైలి మెరుపులు మెరిపించిన విరాట్ కోహ్లీని ప్రశంసలు ముంచెత్తుతున్నాయి. టీ 20లో అసాధ్యమనుకున్న 208 పరుగుల లక్ష్య ఛేదనలో 94 పరుగులతో కీలక పాత్ర పోషించాడు విరాట్. ప్రారంభంలో అభిమానులను భయపెట్టినప్పటికీ 8 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఆటను ముగించింది.

విరాట్ కు టీ20లో ఇది వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ కూడా. విరాట్ అజేయమైన బ్యాటింగ్ శైలికి ముగ్ధుడైన మాజీ ప్రపంచ ప్రసిద్ధ క్రికెటర్ రిచర్డ్స్ ‘అద్భుతం.. అత్యద్భుతం’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి పొంగిపోయిన విరాట్ ‘థాంక్యూ బిగ్ బాస్. మీ ప్రశంసలు వెలకట్టలేనివి’ అంటూ రిప్లై ఇచ్చాడు. అశ్విన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, భజ్జీ, కుల్ దీప్ యాదవ్, వీరూ తదితరులు విరాట్ ను పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు.
Sat, Dec 07, 2019, 10:01 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View