ఖమ్మంలో ఉత్సాహంగా సాగిన 'వెంకీ మామ' మూవీ ప్రీ రిలీజ్ వేడుక
Advertisement
వెంకటేశ్‌, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఖమ్మంలో అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా మూవీ ట్రైలర్ లో వెంకటేశ్ చెప్పిన డైలాగులు అలరించాయి. ‘మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని మీ నమ్మకం. ఆ రాతను తిరిగిరాసే శక్తి మనిషికి ఉందని నా నమ్మకం’ అంటూ వెంకటేశ్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. వెంకీ ఈ చిత్రంలో చేసిన కామెడీ హాజరైన ప్రేక్షకులందరినీ అలరించింది.

మరో వైపు ‘నీ నుంచి నన్నెవరూ దూరం చేయలేరు మామయ్యా. అది నీవల్ల కూడా కాదు’ అని అక్కినేని నాగ చైతన్య అన్న డైలాగులు కూడా ట్రైలర్ లో ఉన్నాయి.  దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వెంకీ, చైతూ ఇద్దరు రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో దర్శనమిస్తున్నారు. వెంకటేశ్ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నాగచైతన్యకు జోడిగా రాశీఖన్నా నటిస్తోంది. ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్‌ 13న భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌ అండ్‌ ఎమోషన్‌ కంటెంట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు  బాబీ దర్శకత్వం వహించారు.
Sat, Dec 07, 2019, 09:19 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View