మీడియాపై విరుచుకుపడ్డ పూనం కౌర్.. ఆ ట్వీట్లు తనవి కావని వివరణ
Advertisement
ఆ నాయకుడికి కూడా రెండు బెత్తం దెబ్బలు అంటూ సినీ నటి పూనం కౌర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఆమె చేసినట్లుగా చెపుతున్న ట్వీట్ తో సోషల్ మీడియా హోరెత్తి పోయింది. విషయం మరింత ముదిరి పాకన పడుతున్న దశలో అసలు తాను ఆ ట్వీట్ చేయలేదని, మీడియా కావాలనే తనను, ఆ వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఇలా అసంబద్ధ ప్రచారానికి తెరతీసిందని ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు పూనం.

అలాగే మీడియాపై తీవ్రస్థాయిలో పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను వైరల్ చేస్తూ సైకోల్లా ప్రవర్తిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇప్పటికే తనకు, తన కుటుంబానికి జరగాల్సిన అన్యాయం ఎలాగూ జరిగిపోయిందని, అయినా వీరి రాతలు ఆగడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతటితో ఆగకుండా #soldmedia (సోల్డ్ మీడియా), presstitutes (ప్రెస్టిట్యూట్స్) అంటూ తీవ్ర పదజాలాన్ని వాడారు. ఈ తరహా వైఖరి కలిగిన ప్రెస్టిట్యూట్స్, పొలిటీషియన్స్ కంటే ఒళ్లు అమ్ముకునే వేశ్యలే నయమని, తమ వారి కోసం కూడా ఏమీ చేయలేని వీరు నాయకులు ఎలా అవుతారని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Sat, Dec 07, 2019, 08:15 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View