సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Advertisement
   *  తాను సినిమాలలో అన్ని రకాలుగానూ మారానని, అయితే ముద్దు విషయంలో మాత్రం మారలేదని చెప్పింది కథానాయిక తమన్నా. 'సినిమాల్లోకి వచ్చినప్పుడే ముద్దు సీన్లలో చేయకూడదని నియమం పెట్టుకున్నాను. ఇప్పటికీ దానినే పాటిస్తున్నాను' అని చెప్పింది తమన్నా.  
*  మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని తాజా సమాచారం.
*  సరైన హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ తన తదుపరి చిత్రాన్ని సెట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆమధ్య చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ తో 'విజేత' చిత్రాన్ని రూపొందించిన రాకేశ్ శశి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు.
*  ఈ ఏడాది ఇప్పటికే 'బ్రోచేవారెవరురా', 'తిప్పరా మీసం' చిత్రాలను చేసిన శ్రీవిష్ణు నిన్న మరో చిత్రాన్ని ప్రారంభించాడు. నూతన దర్శకుడు హసిత్ గోలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది.  
Sat, Dec 07, 2019, 07:26 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View