కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ హవా
Advertisement
సంచలన రాజకీయాలకు పేరు గాంచిన కర్ణాటక మరోసారి దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ కానుంది. కుమారస్వామి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ 14 నెలలకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అధికార కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను బీజీపే తనవైపు తిప్పుకుని యడ్యూరప్ప నాయకత్వంలో సర్కార్ ఏర్పాటు చేసింది. అయితే ఈ విషయంలో కీలకంగా వ్యవహరించి గోడదూకిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో ఆయా స్థానాల్లో గురువారం ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

ఈ ఉప ఎన్నికలకు సంబంధించి నిన్న సాయంత్రం నుంచి వెలువడుతున్నఎగ్జిట్
పోల్స్ లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. యడ్యూరప్ప సర్కార్ గట్టెక్కడానికి ప్రస్తుతం 6 సీట్లు తప్పని సరిగా గెలుచుకోవాలి. అయితే, ప్రముఖ మీడియా సంస్థలు అన్నీ 15 స్థానాలలో బీజేపీకి మెజారిటీ సీట్లు దక్కే అవకాశం ఉందని ప్రకటించడం విశేషం.

కొన్ని సంస్థలు ఏకంగా బీజేపీకి 10 నుంచి 12 సీట్లు రావచ్చని చెపుతుండడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో బీజేపీ శ్రేణులు సంతోషంతో గంతులేస్తుంటే.. కాంగ్రెస్, జేడీఎస్ కేడర్ ఉత్కంఠను ఎదుర్కొంటోంది. ఈ టెన్షన్ కు 9 తేదీన జరుగే ఓట్ల లెక్కింపుతో తెరపడుతుంది.
Fri, Dec 06, 2019, 10:06 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View