దేశంలోని బెస్ట్ పోలీస్ స్టేషన్ల జాబితాలో తెలంగాణ పీఎస్ చొప్పదండి!
Advertisement
కేంద్ర హోం శాఖ ప్రకటించిన దేశంలోని టాప్ -10 బెస్ట్ పోలీస్ స్టేషన్ల జాబితాలో తెలంగాణ పోలీస్ స్టేషన్ కు చోటు దక్కింది. కరీంనగర్ లోని చొప్పదండి పోలీస్ స్టేషన్ తన సమర్థమైన పనితీరుతో ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. సమర్థంగా పనిచేసే పోలీస్ స్టేషన్ల జాబితాను కేంద్రం హోం శాఖ ఈ రోజు ప్రకటించించింది. ఆస్తి తగాదాలు, మహిళలు, అణగారిన వర్గాలపై నేరాల సంఖ్య ఆధారంగా జాబితాను రూపొందించామని హోం శాఖ అధికారులు తెలిపారు.

జాబితాలో చొప్పదండి పోలీస్ స్టేషన్ 8వ స్థానంలో నిలిచింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని అబెర్ దీన్ పోలీస్ స్టేషన్ జాబితాలో అగ్ర స్థానాన్ని పొందింది. రెండో స్థానంలో గుజరాత్ లోని బాలా సినోర్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్ కు చెందిన అజిక్ బుర్హాన్ పూర్, నాలుగో స్థానంలో తమిళనాడుకు చెందిన ఏడబ్ల్యూపీఎస్ థేని, ఐదో స్థానంలో అరుణాల్ ప్రదేశ్ కు చెందిన అనిని పీఎస్, ఆరో స్థానంలో ఢిల్లీలోని ద్వారక, ఏడో స్థానంలో రాజస్థాన్ కు చెందిన బకాని, తొమ్మిదో స్థానంలో గోవాలోని బిచో లిమ్ ఉండగా, మధ్యప్రదేశ్ లోని బార్ గావా పదో స్థానంలో నిలిచింది.
Fri, Dec 06, 2019, 09:25 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View