నిత్యానంద ఎక్కడ ఉన్నాడో అంచనా వేయలేకపోతున్నాం: విదేశాంగ శాఖ
Advertisement
పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన గుజరాత్ కు చెందిన ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ఆచూకీ ఇంకా స్పష్టంగా గుర్తించలేదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ కు చెందిన నిత్యానంద తన ఆశ్రమంలో పిల్లలను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

నిత్యానంద విదేశాలకు పారిపోయాడని.. ఈక్వెడార్ వద్ద చిన్న దీవిని కొనుగోలుచేసి దానికి కైలాసం అనే పేరు పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిత్యానంద ఆచూకీపై స్సందించింది.

‘నిత్యానంద ఎక్కడ ఉన్నాడో అంచనా వేయలేకపోతున్నాం. ఆయన పాస్ పోర్టును రద్దు చేశాం. కొత్త పాస్ పోర్టుకోసం పెట్టుకున్న దరఖాస్తును కూడా తిరస్కరించాం’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మీడియాకు తెలిపారు. ఇది ఇలా ఉండగా నిత్యానంద ఆచూకీ కోసం విదేశాల్లో ఉన్న అన్ని భారత రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేసినట్లు రవీష్ వెల్లడించారు.
Fri, Dec 06, 2019, 07:57 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View