కేసీఆర్ కు, తెలంగాణ పోలీస్ కు సెల్యూట్ కాదు పాదాభివందనం చేస్తున్నా: పోసాని కృష్ణ మురళి
Advertisement
దిశ ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై రాజకీయనాయకులు, సినీ తారలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, దిశ కుటుంబసభ్యులు, మహిళా సంఘాలు తదితరులు తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా, వైసీపీ నాయకుడు, సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి స్పందిస్తూ.. నలుగురు నిందితులు చనిపోయారని తెలిశాక తెలంగాణలో పండగ వాతావరణం ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ పోలీస్ కు సెల్యూట్ కాదు, పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.

తెలంగాణ ప్రజానీకం మొత్తానికి, ఓటున్న ప్రతి ఒక్కరికీ చెబుతున్నా ‘కేసీఆర్ చనిపోయే వరకూ కేసీఆర్ నే ముఖ్యమంత్రిగా ఉంచండి. ఇండియాలో తెలంగాణ బెస్ట్ స్టేట్ అవుతుంది’ అని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చారని ఈ సందర్భంగా ప్రశంసించారు. తక్కువ సమయంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నారా? అని ప్రశ్నించారు.
Fri, Dec 06, 2019, 07:42 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View