ఉప్పల్ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా
Advertisement
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరిగే తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచింది. ఇక్కడ ఛేదన అనుకూలంగా ఉంటుందన్న నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ముమ్మర సాధన చేశాయి.

భారత్ ఈ మ్యాచ్ కోసం మెరుగైన జట్టుతో బరిలో దిగుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, పంత్, జడేజా వంటి కీలక ఆటగాళ్లు విండీస్ పై రాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్, శివమ్ దూబే వంటి హార్డ్ హిట్టర్లు కూడా ఉన్నారు.

ఇక విండీస్ జట్టు ఈ మ్యాచ్ లో భారత్ ను నిలువరించాలని ప్రణాళికలు రచించింది. లూయిస్, హెట్మెయర్ వంటి యువ ప్రతిభావంతులతో పాటు కెప్టెన్ పొలార్డ్, లెండిల్ సిమ్మన్స్ వంటి సీనియర్లతో కరీబియన్ జట్టు కూడా బలంగానే ఉంది.
Fri, Dec 06, 2019, 06:59 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View