సోమాలియా దిశగా ప్రయాణిస్తున్న ‘పవన్’ తుపాన్
నైరుతి అరేబియా సముద్రం మీదుగా నిన్న ఏర్పడ్డ తుపాన్ దక్షిణాఫ్రికాలోని సోమాలియా దిశగా ప్రయాణిస్తోంది. శ్రీలంక దేశం ప్రతిపాదన మేరకు ఈ తుపాన్ కు ‘పవన్’ అని నామకరణం చేశారు. రేపటి లోపు ఇది బలహీనపడుతుందని, ఈ తుపాన్ వల్ల భారత్ కు అంత ప్రమాదం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నిపుణులు భావిస్తున్నారు. నైరుతి అరేబియాలోని ఆఫ్రికా తీరంలో ‘పవన్’ తుపాన్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, కర్ణాటక తీరానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరో వాయుగుండం కొనసాగుతోంది.
Fri, Dec 06, 2019, 06:45 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View