యూపీలో ఘాతుకం.. మహిళా స్టేజ్ డ్యాన్సర్ పై కాల్పులు
నృత్యం ఆపిందని.. మహిళ ముఖంపై తుపాకీతో కాల్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ లో చోటుచేసుకుంది. డిసెంబర్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ పెళ్లివేడుకలో నృత్య కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేయగా.. ఉత్సాహంతో ఓ వ్యక్తి గన్ పట్టుకుని కళాకారులు నృత్యం చేస్తున్న వేదికపైకి ఎక్కాడు. దీంతో నృత్యం చేస్తున్న మహిళలు నృత్యాన్ని ఆపేశారు. డ్యాన్స్ ఎందుకు ఆపారు ? ఆపొద్దు చేయండి అంటూ.. తన వద్ద ఉన్న గన్ తో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన మహిళ ఆస్పత్రిలో కోలుకుంటోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Fri, Dec 06, 2019, 06:45 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View