మన దేశంలో ఎల్లప్పుడూ చెడుపై మంచే గెలుస్తుంది: కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
Advertisement
మనదేశంలో చెడుపై ఎల్లప్పుడూ మంచే గెలుస్తుందని కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించారన్నారు. నిందితులకు తగిన శాస్తి జరిగిందన్నారు. దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై రాజ్యవర్ధన్ సింగ్ స్పందించారు. ‘పోలీసులను పోలీసులుగా వ్యవహరించడానికి అనుమతినిచ్చిన నాయకులకు అభినందనలు. మనదేశంలో చెడుపై ఎల్లప్పడూ మంచే గెలుస్తుందని అందరికీ తెలిసిందే’ అని రాథోడ్ అన్నారు.

మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ..‘ఆశారాం, రామ్ రహీమ్ లకు కూడా ఇలాంటి శిక్షే విధిస్తారా? వారిపై కూడా అత్యాచార ఆరోపణలున్నాయి. ఇలాంటి నేరాలు చేసిన వారికి మరణ శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. కాని చట్టం ప్రకారం అమలుచేయాలి’ అని అన్నారు.
Fri, Dec 06, 2019, 06:27 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View