సజ్జనార్ సొంతూర్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం!
Advertisement
ఎంత మార్పు..!
దిశ అత్యాచార ఘటన తర్వాత తెలంగాణ పోలీసులపై విమర్శలు అన్నీఇన్నీ కావు. వారు సరైన సమయంలో స్పందించలేదని, దిశ తల్లిదండ్రులతో అమర్యాదకరంగా మాట్లాడారని ఎంతో వ్యతిరేకత వచ్చింది. కానీ ఇవాళ ఉదయం దిశ నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం అవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి. తెలంగాణ పోలీసులకు ప్రతి ఒక్కరూ శాల్యూట్ చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ ఎన్ కౌంటర్ లో ప్రధానపాత్ర పోషించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు హీరో ఇమేజ్ వచ్చింది. సజ్జనార్ ను అభినందిస్తూ వస్తున్న సందేశాలు, వ్యాఖ్యలకు లెక్కేలేదు.

ఇక ఆయన సొంతూరు కర్ణాటకలోని అసుతి గ్రామంలో అయితే పండుగ వాతావరణం నెలకొంది. ఎన్ కౌంటర్ విషయం తెలియగానే ప్రజలు హర్షాతిరేకాలతో తమ స్పందన వెలిబుచ్చారు. గ్రామస్తులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. సజ్జనార్ ఇంటికి బంధుమిత్రులు, ఇతర గ్రామస్తులు పోటెత్తారు. దీనిపై సజ్జనార్ సోదరుడు ప్రకాశ్ స్పందించారు. తన సోదరుడు సజ్జనార్ ఎప్పుడూ సామాజిక న్యాయం గురించే తపించిపోయేవాడని, ఈ ఘటన పట్ల తాము గర్విస్తున్నామని చెప్పారు.
Fri, Dec 06, 2019, 06:19 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View