ఎన్ కౌంటర్లకు నేను వ్యతిరేకం: అసదుద్దీన్ ఒవైసీ
Advertisement
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తాను ఎన్ కౌంటర్లకు వ్యతిరేకమని తన వైఖరిని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి ఎన్ కౌంటర్లను వ్యక్తిగతంగా తాను ఇష్టపడనని తెలిపారు. ఈ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించిందని, సైబరాబాద్ పోలీసులు ఎందుకు ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందో, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేశారో ఈ విచారణలో తేలుతుందని అన్నారు.
Fri, Dec 06, 2019, 05:56 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View