దిశకు ఇది నిజమైన నివాళి: ప్రముఖ హీరో చిరంజీవి
Advertisement
దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పందించారు. దిశకు ఇది నిజమైన నివాళి అని, ఆమె తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్టయిందని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులపై ఆయన ప్రశంసలు కురిపించారు. వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసు ఓ కొలిక్కి రావడం అభినందనీయమని, సీపీ సజ్జనార్ లాంటి అధికారులు ఉన్న పోలీస్ వ్యవస్థకు, కేసీఆర్ ప్రభుత్వానికి తన అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.

దిశ ఘటనలోని నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారన్న వార్తను ఉదయం చూశానని, నిజంగా ఇది సత్వర న్యాయం అని భావించినట్టు చెప్పారు. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందేనని, అకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలని, నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలని అన్నారు.
Fri, Dec 06, 2019, 04:26 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View