ఈ రోజు నలుగురు భారత క్రికెటర్ల బర్త్ డే!
Advertisement
ఈ రోజు నలుగురు భారత క్రికెటర్లు తమ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్,  ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ లు ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వీరందరికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా, మైదానంలో ఈ నలుగురు చేసిన సంబరాల వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘బర్త్ డే బాయ్స్ జడేజా, బుమ్రా, శ్రేయస్, కరుణ్ లకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేసింది. కాగా, ఈ రోజు హైదరాబాద్ వేదికగా విండీస్ తో  ప్రారంభం కానున్న పొట్టి ఫార్మాట్ సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా పాల్గొంటున్నారు . గాయంతో బుమ్రా జట్టుకు దూరం కాగా, కరుణ్ నాయర్ 2016 తర్వాత జట్లులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే.
Fri, Dec 06, 2019, 04:26 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View