పూణెలో మోదీకి ఘన స్వాగతం పలికిన ఉద్ధవ్ థాకరే
Advertisement
ప్రధాని మోదీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఘన స్వాగతం పలికారు. జాతీయ భద్రతపై డీజీల వార్షిక సదస్సుకు హాజరయ్యేందుకు ఈరోజు మోదీ పూణె వచ్చారు. ఈ సందర్భంగా పూణె విమానాశ్రయంలో ఆయనకు థాకరే స్వాగతం పలికారు. ప్రొటోకాల్ ప్రకారం పూణె విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు థాకరే వచ్చారు. ఎన్డీయేకు దూరం జరిగి, ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత మోదీని థాకరే కలవడం ఇదే తొలిసారి. థాకరే ప్రమాణస్వీకారానికి మోదీ హాజరుకానప్పటికీ... ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Fri, Dec 06, 2019, 04:16 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View