ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారమా?: మంచు లక్ష్మి
Advertisement
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి స్పందించారు. దిశ ఘటనలో నిందితులను కాల్చి చంపారన్న వార్త వినగానే ఓ స్త్రీగా, మాతృమూర్తిగా ఎంతో హర్షించాను, ఓ అమ్మాయిగా గర్వపడుతున్నాను, కానీ సమస్యలకు ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారం ఇస్తుందా? అంటూ మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి అన్ని సంఘటనల్లోనూ రావాలి, దిశ మాత్రమే కాదు, నెలల వయసున్న పసికందులు, వృద్ధ మహిళలు కూడా అఘాయిత్యాల బారినపడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్ కౌంటర్ దిశ తల్లిదండ్రులకు కొంతమేర ఉపశమనం మాత్రమేనని, వారి బాధ తీరనిదని తెలిపారు. స్త్రీల పరిస్థితిలో మార్పు రావాలంటే చట్టాల్లో మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Fri, Dec 06, 2019, 04:15 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View