దిశ కుటుంబసభ్యులకు న్యాయం జరిగింది: ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్
Advertisement
దిశ ఘటనలో నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందడంపై ఇప్పటికే ప్రజలు, మహిళా సంఘాలు, సెలెబ్రిటీలు, బాధితురాలి కుటుంబసభ్యులు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బగేల్ స్పందిస్తూ, ఒక నేరస్థుడు తప్పించుకునేటప్పుడు పోలీసులకు వేరే మార్గం ఉండదని, దిశ కుటుంబసభ్యులకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు.


ఉన్నావో, దిశ ఘటనలు అత్యంత బాధాకరం: కేంద్ర మంత్రి స్మతి ఇరానీ

ఉన్నావో, దిశ ఘటనలపై లోక్ సభలో ఈరోజ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మతి ఇరానీ మాట్లాడుతూ, ఈ ఘటనలు అత్యంత బాధాకరమని, వీటిని రాజకీయం చేయొద్దని సూచించారు. తెలంగాణ పోలీసులను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభినందించారు.
Fri, Dec 06, 2019, 03:13 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View