ఈ ఎన్ కౌంటర్ తో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది: ప్రొఫెసర్ హరగోపాల్
Advertisement
దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై ప్రొఫెసర్ హరగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ఎవరైనా సరే నిగ్రహం కోల్పోవడం సరికాదని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చట్టాన్ని కాదని శిక్షలు వేస్తే కొంత న్యాయం జరిగిందని భావించవచ్చని... కానీ, ఎన్ కౌంటర్లు చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు. దిశ హత్య అత్యంత ఘోరమైన ఘటనేనని... అయితే, నేరాన్ని రాజ్యమే హత్య చేయడం సరికాదని చెప్పారు. ఇలాంటి ఘటనల్లో నేరాన్ని కోర్టులో రుజువు చేసి, అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేయవచ్చని తెలిపారు. ప్రజలు కోరుకుంటున్నారు కదా అని ఎన్ కౌంటర్లు చేయడం కరెక్ట్ కాదని అన్నారు.
Fri, Dec 06, 2019, 02:40 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View