'ఎన్ కౌంటర్' చేసిన హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం
Advertisement
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపిన విషయం తెలిసిందే. వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపామని వారు అంటున్నారు. అయితే, దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కౌంటర్ పై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

దీనిపై తమకు సమాధానం చెప్పాలని సూచించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు జాతీయ మానవ హక్కుల సంఘం తెలిపింది. కాగా, దిశ హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై దేశ వ్యాప్తంగా ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. కొందరు మాత్రం పోలీసుల చర్యను వ్యతిరేకిస్తున్నారు. కాసేపట్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు.
Fri, Dec 06, 2019, 02:24 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View