వ్యక్తిగత సహాయకుడి మృతి... ఢిల్లీ పర్యటన అర్ధంతరంగా ముగించుకున్న సీఎం జగన్
Advertisement
ఏపీ సీఎం జగన్ విషాదంలో మునిగిపోయారు. ఆయన వ్యక్తిగత సహాయకుడు నారాయణ మృతిచెందారు. నారాయణ అనారోగ్యంతో మరణించారు. రెండ్రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ తన సహాయకుడి మరణ వార్తతో పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్నారు. రాయలసీమ ప్రాంతానికే చెందిన నారాయణకు వైఎస్ కుటుంబంతో మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. వైఎస్ రాజారెడ్డి హయాం నుంచి వారి కుటుంబానికి నమ్మినబంటుగా ఉన్నారు. నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లె. కాగా సీఎం జగన్ ఢిల్లీ నుంచి కడప చేరుకుని అక్కడి నుంచి దిగువపల్లె వెళతారు.
Fri, Dec 06, 2019, 02:19 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View